• Neti Charithra

Breaking.. పిటిఎం సరిహద్దు లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో దాడులు.. భారీగా పట్టుపడ్డ కర్ణాటక మద్య


Breaking.. పిటిఎం సరిహద్దు లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో దాడులు.. భారీగా పట్టుపడ్డ కర్ణాటక మద్యం..!


పెద్దతిప్పసముద్రం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం లో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ మధు మోహన్ రావు సిబ్బంది తో కలిసి గురువారం జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం పట్టుపడింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం అందుకున్న అధికారులు నిఘా ఉంచారు. ఈ సందర్భంగా సంపతి కోటవైపు అనుమానాస్పదంగా వస్తున్న వాహనాన్ని గుర్తించిన అధికారులు

ఛేజింగ్ చేసి పట్టుకునే ప్రయత్నం లో నిందితులు వాహనాన్ని వదిలి పరారు అయ్యారు. ఈ సందర్భంగా వాహనంలో తరలిస్తున్న 5188 కర్ణాటక మద్యం ప్యాకెట్లు సీజ్ చేశారు. కాగ బూచిపల్లె సమీపం లో జరిపిన దాడుల్లో మరో 290 కర్ణాటక మద్యం ఆయాకెట్లు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చెందినట్లు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.

908 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon