• Neti Charithra

Breaking..పుంగనూరు మున్సిపాలిటీ కి జాతీయ స్థాయిపురస్కారం..కమిషనర్ వర్మ కు వెలువెత్తిన్న అభినందనలు..!


Breaking..పుంగనూరు మున్సిపాలిటీ కి జాతీయ స్థాయి పురస్కారం..కమిషనర్ వర్మ కు వెలువెత్తిన్న అభినందనలు..!


పుంగనూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ

జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావడంతో మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ కు అభినందనలు వెలువెత్తాయి.

వివరాల్లోకి వెళితే..పుంగనూరు మున్సిపాలిటిలో కరోనా నియంత్రణ కార్యక్రమాలు, నివారణ చర్యలు


( పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ ను సత్కరిస్తున్న స్థానిక నేతలు)



చేపట్టడం లో మంచి ఫలితాలు సాధించారు.

దింతో పుంగనూరు మున్సిపాలిటీ కి

జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. న్యూఢీల్లికి చెందిన పబ్లిక్

రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా వివిధ రంగాలలోదేశవ్యాప్తంగా సేవలు అందించిన వారికి అవార్డులు, ప్రశంస

పత్రాలు అందజేస్తుంది. ఈ మేరకు శనివారం పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కెఎల్.వర్మకు మెయిల్ సందేశం పంపారు. కరోనా నియంత్రణ కోసం సమిష్టిగా కృషి చేసినందుకు జాతీయ స్థాయిలో రెండవ బహుమతినిప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి

మ్యిధున్ రెడ్డి లుకమిషనర్‌కు, పట్టణ ప్రజలకు, నాయకులకుఅభినందనలు తెలిపారు. సమిష్టి కృషితో ఇలాంటి విజయాలు సాధ్యమౌతుందని, పుంగనూరు అభివృద్ధికి ఇలాగే సహకరించాలని మంత్రి కోరారు.

కాగ మున్సిపాలిటీకి జాతీయ స్థాయి అవార్డు రావడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం తదితరులు

కమిషనర్‌ను ఘనంగా సన్మానించారు.