• Neti Charithra

Breaking.. పేకాట కేంద్రం పై దాడులు చేసిన పోలీసులకు రూ.2.35 లక్షలు రివార్డు..!


Breaking..

పేకాట కేంద్రం పై దాడులు చేసిన

పోలీసులకు రూ.2.35 లక్షలు రివార్డు..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


తూర్పుగోదావరి జిల్లా ఉండి ఎస్ ఐ వి.అప్పలరాజు, ఇద్దరు కాన్సిస్టేబుళ్లకు రూ.2.35 లక్షల విలువైన రివార్డు చెక్కులను నరసాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి పాలకోడేరు పోలీస్‌ స్టేషన్‌లో గురువారం అందించారు. వివరాలు ఇలా.. ఈ ఏడాది అక్టోబరు ఒకటిన యండగండిలో నిర్వహిస్తున్న




పేకాట స్థావరంపై దాడిచేసి 13 మందిని అరెస్టు చేశారు. రూ.9.45లక్షలు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడంతో పోలీసు సిబ్బందిని అభినందిస్తూ రివార్డు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్సై అప్పలరాజుకు రూ.1.41 లక్షలు, కానిస్టేబుళ్లు ఎన్‌.గోపి, కె.సురేష్‌లకు ఒక్కొక్కరికి రూ.47 వేల చొప్పున చెక్కులను అందించారు. ఈ సందర్భంగా రివార్డు గ్రహీతలను డీఎస్పీ అభినందించారు.


378 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon