• Neti Charithra

Breaking.. పరిచయం..పెంచుకున్నాడు.. ఇంట్లోకి వెళ్లి.. మహిళా వాలంటీర్ పై తోటి వాలంటీర్ అత్యాచారం..!


Breaking.. పరిచయం..పెంచుకున్నాడు.. ఇంట్లోకి వెళ్లి.. మహిళా వాలంటీర్ పై తోటి వాలంటీర్ అత్యాచారం..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


వాలంటీర్‌... మరో మహిళా వాలంటీర్‌పై

కన్నేశాడు. ఆపై నేరుగా ఇంటికెళ్లి ఆమె పై అత్యాచారం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. సీఐ సుబ్బారావు, కథనం మేరకు..

ఎం.నవీన్‌కుమార్‌ అనే యువకుడు ఎం.వేములపాడులో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన మరో యువతి కూడా వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా సదరు యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 6న బయోమెట్రిక్‌ యంత్రం కోసం సదరు మహిళా వాలంటీర్‌... నవీన్‌కుమార్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమెపై

అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో బాధిత యువతి కాస్త ఆలస్యంగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్‌కుమార్‌పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్