- Neti Charithra
Breaking.. పది సంవత్సరాలు..ప్రేమించి..మోసం చేసిన పోలీస్ అరెస్ట్..!
Breaking.. పది సంవత్సరాలు..ప్రేమించి..మోసం చేసిన పోలీస్ అరెస్ట్..!
విశాఖ: నేటి చరిత్ర
ప్రేమ పేరుతో యువతినిమోసం చేసిన కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన విశాఖ జిల్లా ఎలమంచి లి లో చోటు చేసుకుంది.ఎలమంచిలి సీఐ
నారాయణరావు, ఎస్సై లక్ష్మణరావు కథనం ప్రకారం.. దోసూరు గ్రామానికి చెందిన గుడిసా పరదేశిరావు 2009లో కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరి, ప్రస్తుతం అనకాపల్లి రూరల్ పో లీసుస్టేషన్‌లో పనిచేస్తున్నాడు. దోసూరు గ్రామానికి చెందిన 27 ఏళ్ల యువతితో 2010 నుంచి ప్రేమాయణం నడుపుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా
లొంగదీసుకున్నాడు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో ఇతనితో పాటు తల్లిదండ్రులు దేవుడు, పారి పిల్లెమ్మ, అక్క జయలక్ష్మిలపై ఈనెల 8న కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరదేశిరావును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
520 views0 comments