• Neti Charithra

Breaking.. పది వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీ కి చిక్కిన విఆర్వో..!


Breaking.. పది వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీ కి చిక్కిన విఆర్వో..!



ఆదోని: నేటి చరిత్ర


కర్నూలు జిల్లాఆదోని మండలం పెసలబండ వీఆర్వో మల్లికార్జున రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం సాయంత్రం అనిశా అధికారులకు పట్టుబడ్డారు. తహసీల్దారు కార్యాలయంలో అనిశా డీఎస్పీ శివనారాయణస్వామి

వివరాలు వెల్లడించారు. పెసలబండకు చెందిన గోవిందరాజు అనే రైతు తండ్రి మృతి చెందడంతో పాసుపుస్తకానికి దరఖాస్తు చేసుకున్నారు. 5.40 ఎకరాలకు పాసు పుస్తకం కోసం 20 రోజులుగా వీఆర్వో మల్లికార్జున చుట్టూ తిరుగుతున్నారు. వీఆర్వో లంచం ఇస్తే తప్ప పని చేయనని తెగేసి చెప్పారు. రూ.20 వేలు డిమాండు చేయగా, రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది. ముందుగా రూ.5 వేలు ఇచ్చారు. మంగళవారం రూ.10 వేలు ఇస్తానని,

ఆదోనిలోని బార్‌పేట వద్దకు రావాలని వీఆర్వోకు రైతు చెప్పారు. అక్కడే అనిశా అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వీఆర్వో పారిపోయేందుకు యత్నించగా, అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్