• Neti Charithra

Breaking.. పది వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టు పడ్డ అటవిశాఖాధికారి..!


Breaking.. పది వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టు పడ్డ అటవిశాఖాధికారి..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


విశాఖ జిల్లా దేవరాపల్లి లో టేకు చెట్లు అక్రమంగా నరికివేశారనే నెపంతో ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ దేవరాపల్లి అటవీశాఖ అధికారి ఎం.రమేశ్‌కుమార్‌ తన ఇంటి వద్ద

ఏసీబీ అధికారులకుపట్టుబడ్డాడు.

అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఎం.రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని సబ్బవరానికి బి.శ్రీను తన ఇంటి నిర్మాణం కోసం దేవరాపల్లి మండలం చింతలపూడి శివారు సమ్మెదలో రైతువద్ద టేకు చెట్లు కొనుగోలు చేశారు. ఆ చెట్లను గతనెల 29న నరికించారు. విషయం తెలుసుకున్న దేవరాపల్లి అటవీశాఖ అధికారి ఎం.రమేశ్‌కుమార్‌ తన బృందంతో కలిసి గత 30న నరికిన చెట్లను పరిశీలించారు. ఈనెల 2న శ్రీనుకు ఫోన్‌చేసి తమ అనుమతి లేకుండా టేకు చెట్లు ఎలా నరికించారని, కేసు నమోదు చేస్తే ఫీజ్‌ కింద రూ. లక్షలు చెల్లించాల్సి ఉంటుందని బెదిరించారు. కేసు లేకుండా చేయడానికి రూ. పది వేలు ఇవ్వమని పలుమార్లు ఫోన్‌చేసి డిమాండ్‌ చేశారు. అటవీ అధికారి తీరుతో విసిగిపోయిన శ్రీను మంగళవారం అనిశా అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరంఏసీబీ దాడికి రంగం సిద్ధం చేసుకున్నారు. శ్రీనుకు రూ. పది వేలు ఇచ్చి ఇంటివద్ద ఉన్న రమేష్‌కుమార్‌కు ఇవ్వమని పంపించారు.

ఇంటి చుట్టూ ఏసీబీ అధికారులు మాటువేశారు. ఈ విషయం గమనించిన రమేశ్‌కుమార్‌ తాను లంచంగా తీసుకున్న రూ. పది వేలు కాల్చివేయమని తన భార్యకు అందజేశాడు. ఆమె గ్యాస్‌స్టవ్‌ వెలిగించి నగదు కాల్చివేస్తుండగా అనిశా అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్