• Neti Charithra

Breaking.. పదేళ్లు..ప్రేమించాడు..పెళ్ళి చేసుకుంటానన్నాడు... మరో యువతి కి తాళి కట్టిన పోలీస్..!



Breaking.. పదేళ్లు..ప్రేమించాడు..పెళ్ళి చేసుకుంటానన్నాడు... మరో యువతి కి తాళి కట్టిన పోలీస్..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)

పదేళ్లు..ప్రేమించి.. పెళ్ళి చేసుకుంటానని.. నమ్మించి.. మరో యువతి ని పెళ్ళి చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ పై అనంతపురం జిల్లాలో కేసు నమోదు అయింది. పోలీసుల కథనం మేరకు..

అనంతపురం జిల్లా ఉరవకొండ సర్కిల్‌లోని విడపనకల్లు పోలీసుస్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ బద్రినాథ్‌ తనను ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి ఇటీవల

పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మంత్రాలయంలో ఓ ప్రైవేటు లాడ్జిలో వారిద్దరూ తరచూ కలిసేవారని దర్యాప్తులో తేలడంతో కేసును మంత్రాలయం సర్కిల్‌ పోలీసు స్టేషన్‌కు బుధవారం బదలాయించారు.

మంత్రాలయం సీఐ కృష్ణయ్య దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆయన వివరాల మేరకు.. బళ్లారికి చెందిన యువతితో బద్రినాథ్‌ పది సంవత్సరాల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వీరు మంత్రాలయానికి తరచూ వచ్చి ప్రైవేటు లాడ్జీలో ఉండేవాళ్లు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ మరో మహిళను వివాహం చేసుకున్నారు. తనను మోసం చేశాడని గుర్తించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించారు. వారు మంత్రాలయంలో కలిసి తిరిగినట్లు కొన్ని సీసీ కెమెరాల్లో నమోదైంది. దింతో ఈ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నద్ధం చేస్తున్నారు.


340 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon