- Neti Charithra
Breaking.. నాలుగు విడతల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..సహాయ నిరాకరణ కు ప్రభుత్వ నిర్ణయం..!
Breaking.. నాలుగు విడతల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..సహాయ నిరాకరణ కు ప్రభుత్వ నిర్ణయం..!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీ లో స్థానిక ఎన్నికల పోరు.. హీట్.. పెంచుతోంది.శనివారం పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పారు. 2019 ఓటరు జాబితాతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. కొత్త జాబితా ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని ఎస్ఈసీ అసంతృప్తి వ్యక్తం
చేశారు.విధిలేని పరిస్థితుల్లోనే 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 3.6 లక్షలమంది కొత్త ఓటర్లు ఓటుహక్కు కోల్పోయారన్నారు. కాగ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ఏపీ చీఫ్ సెక్రెటరీ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది
471 views0 comments