• Neti Charithra

Breaking.. నాటు సారా కు యువకుడు బలి.. కేసునమోదు చేసిన బి కొత్తకోట పోలీసులు..!


Breaking.. నాటు సారా కు యువకుడు బలి.. కేసునమోదు చేసిన బి కొత్తకోట పోలీసులు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


( అనుమానాస్పద స్థితి లో మృతి చెందిన నరేంద్ర)


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గోళ్లపల్లి సమీపం లో నాటు సారా తాగి ఓ యువకుడు గురువారం అనుమానాస్పద స్థితి లో మృతి చెందడం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. గోళ్లపల్లి కి చెందిన యువకుడు నరేంద్ర బుధవారం నాటుసారా తాగి మృతి చెందగా సమాచారం అందుకున్న బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశ్వనీయ సమాచారం మేరకు..

గోళ్లపల్లి సమీపం దట్టమైన పొదల మధ్యన ముట్రా వారిపల్లె కు చెందిన కొందరు కొంత కాలం గానాటు సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం . అయితే అదే ప్రాంతంలో గురువారం గోళ్లపల్లి కి చెందిన నరేంద్ర అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. అయితే అతను కల్తీ నాటు సారా తాగి మృతి చెందాడా.. లేక వండుతున్న నాటు సారా నిల్వలు పడి మృతి చెందాడా.. అన్న విషయం పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. నరేంద్ర మృత దేహం పై శరీరం బొబ్బలతో కాలి ఉన్న గాయాలు అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ నిత్యం నాటు సారా అమ్మకాలు జరుగుతున్నాయని..

నాటు సారా తయారీ నిర్వాకుల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.