• Neti Charithra

Breaking..నీటి వాగులో పడి..ముగ్గురు గల్లంతు..కాపాడేందుకు దూకిన వాలంటీర్..చిత్తూరు జిల్లా లో విషాదం!


Breaking..నీటి వాగులో పడి ..ముగ్గురు గల్లంతు.. వాగులో కి దూకిన వాలంటీర్..చిత్తూరు జిల్లా లో విషాదం!


తిరుపతి: నేటి చరిత్ర


( వాలంటీర్ సాయికుమార్ ను విచా

రిస్తున్న ఎస్పీ రమేష్ రెడ్డి)


చిత్తూరు జిల్లా లో సోమవారం రాత్రి వాగు లో నీటి ఉధృతి లో ముగ్గురు గల్లంతు కావడం తో విషాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

గాజుల మండ్యం మండలంలోని కల్లూరు సమీపంలోని చీవలవారివాగులో సోమవారం ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందారు. ఇద్దరి కోసం అధికారులు గాలిస్తున్నారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలో బంధువు చనిపోవడంతో కల్లూరు దళితవాడకు చెందిన 14 మంది కాలినడకన వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కల్లూరు సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చీవలవారివాగు కాజ్‌వేను దాటేందుకు ప్రయత్నించారు. 11 మంది సురక్షితంగా అవతలికి వెళ్లారు.



(వాగులో గల్లంతు ఆయిన్ ముగ్గురు)


ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో యశోద(35) ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఆమె నీరు మింగడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందారు. మరో ఇద్దరు గంగయ్య, సుజాత వాగులో గల్లంతయ్యారు.

నీటి ప్రవాహం లో కింద పడ్డ గంగయ్యను కాపాడే ప్రయత్నం లో మరో ఇద్దరు మహిళలు వాగు లో గల్లంతు అయినట్లు సమాచారం. కాగ నీటి లో గల్లంతు అయిన వారిలో ఓ మహిళను కాపాడే విషయం లో స్థానిక గ్రామ వాలంటీర్ సాయి కుమార్ నీటి వాగు లో దూకి రక్షిం చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఆమెను ఒడ్డుకు చేర్చి ఆస్పత్రికి తరలించే లోపు ఆమె నీరు అధికంగా తాగి ఉండటంతో మృతి చెందింది. సాయికుమార్ సాహసోపేత కృషిని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.