• Neti Charithra

Breaking.. నలుగురు ఈత కు వెళ్లారు.. ఇద్దరు మృతి చెందారు..!


Breaking.. నలుగురు ఈత కు వెళ్లారు.. ఇద్దరు మృతి చెందారు..!



విజయవాడ: నేటి చరిత్ర


స్నేహితులతో కలిసి నలుగురు ఈతకు వెళ్లగా .. ఇద్దరు మృతి చెందిన ఘటన విజయవాడ లో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. మేరకు..కానూరు సనత్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ రెహమాన్‌ (17), పెదపులిపాక ఎంవీఆర్‌ నగర్‌కు చెందిన షేక్‌ సమీర్‌ (13)లు బంధువులు. రెహమాన్‌ కృష్ణలంకలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తుండగా, సమీర్‌ యనమలకుదు రులోని ఆర్‌కే పబ్లిక్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం వీరిద్దరూ కృష్ణలంకకు చెందిన ఒక బాలుడు, సమీర్‌ ఇంటి వద్ద ఉండే మరో బాలుడు శ్రీనివాసరావుతో కలసి పెదపులిపాక సమీపంలోని కృష్ణా నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. నలుగురు ఈతాడుతుండగా రెహమాన్‌, సమీర్‌లు లోతైన ఊబిలోకి జారిపోయారు. అప్పటికే వారితో కలసి ఈత కొడుతున్న శ్రీనివాసరావు అది చూసి భయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. వారిద్దరూ నిమిషాల వ్యవధిలో మునిగిపోయారు. ఇద్దరు గల్లంతు తో కుటుంబ సభ్యులు లో విషాదం నెలకొంది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్