• Neti Charithra

Breaking.. నడి రోడ్డు పై లారీ లో మంటలు..ఇద్దరు సజీవ దహనం..!


Breaking.. నడి రోడ్డు పై

లారీ లో మంటలు..ఇద్దరు సజీవ దహనం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)

కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో

పెను ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా

శనివారంరోడ్డుపై వెళ్తోన్న పార్సిల్ లారీ.. పైన ఉన్న హై టెన్షన్ కేబుల్స్ ను తాకింది. అయితే, అదే సమయంలో లారీ పక్కనుండి వెళ్తోన్న బైక్ మీద కూడా ఆ వైర్లు పడి బైక్ మీదున్న ఇద్దరు వాహనదారులు సజీవదహనమయ్యారు. మృతి చెందిన వ్యక్తులు నూజివీడు మండలం మీర్జాపురం వాసులుగా గుర్తించారు. లారీకి మంటలు అంటుకోవడంతో ప్రమాదాన్ని ముందే

గుర్తించి కంటైనర్ నుండి దూకి లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు దక్కించుకున్నారు. బైక్ పై వస్తోన్న వాహనదారులు మాత్రం విద్యుత్ ఘాతానికి గురై ఘటనా స్థలంలోనే సజీవదహనమై బుగ్గిగా మారిపోయారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు, అగ్నిమాపక దళ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు ఇద్దరు మీర్జాపురం గ్రామానికి చెందిన పెనుమాక జ్యోతిబాబు, షేక్ మస్తాన్ గా పోలీసులు గుర్తించి, మృతదేహాలను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్