• Neti Charithra

Breaking... నడి రోడ్డు పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ.. సర్కిల్ ఇన్స్ పెక్టర్..!


Breaking... నడి రోడ్డు పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ.. సర్కిల్ ఇన్స్ పెక్టర్..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ అధికారి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల వరంగల్ కేసియు పోలీస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు కథనం మేరకు.. సీఐ సాయి రమణ

బుధవారం సాయంత్రం 6గంటలకు కేయూసీ ఫిల్టర్‌ బెడ్‌ సమీపంలో

నడి రోడ్డు పైతన కారులోనే సీఐ


పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అదే దారినుంచి వెళ్తున్న బ్లూకోల్ట్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది గమనించారు. అదే సమయంలో సీఐ సాయిరమణకు ఫోన్‌ రావడంతో బ్లూకోల్ట్‌ సిబ్బంది ఫోన్‌ ఎత్తి మాట్లాడగా ఆయన చిట్యాల సీఐ అని తెలపడంతో హుటాహుటిన వారు హన్మకొండలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి ఉన్నట్లు గుర్తించారు.