• Neti Charithra

Breaking.. నగ్నంగా పూజలు పేరుతో.. మైనర్ బాలిక పై పూజారి లైంగిక దాడి..కేసు నమోదు చేసిన పోలీసులు!


Breaking.. నగ్నంగా పూజలు పేరుతో.. మైనర్ బాలిక పై పూజారి లైంగిక దాడి..కేసు నమోదు చేసిన పోలీసులు!





నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఆలయం లో పూజలు కోసం వచ్చిన ఓ బాలిక పై ఆలయ పూజారి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తెలంగాణా లో చోటు చేసుకుంది.

మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, సీఐ జగదీశ్వరరావుల కథనం మేరకు..

మల్కాజిగిరి ఠాణా పరిధిలోని ఓ గుడిలో చింతపల్లి వేంకటేశ్వర శర్మ(46) అర్చకుడు. గత నెల 17 నుంచి ఓ బాలిక(16) అమ్మవారి దీక్ష తీసుకొని పూజలు చేస్తోంది. ప్రత్యేక పూజలు చేయించాలని చెప్పడంతో ఆదివారం సాయంత్రం బాలిక వచ్చింది. చీకట్లో ఆమెతో ఏవో మాత్రలు మింగించాడు. రాత్రి నగ్నంగా పూజలు చేయాలని, మళ్లీ రావాలని చెప్పి పంపాడు.

ఇంటికివచ్చిన బాలిక మాత్రల ప్రభావంతో వాంతులు చేసుకుంది. కుటుంబ సభ్యులు ప్రశ్నించగా జరిగిన విషయం వెల్లడించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు పూజరిని పోలీసులు రిమాండ్ కు పంపారు.