• Neti Charithra

Breaking... నగర పంచాయతీకి.. రాజకీయ గ్రహణం.. ఆర్డినెన్స్ ఇచ్చి నా ఎన్నికలకు దూరమే..!


Breaking... నగర పంచాయతీకి.. రాజకీయ గ్రహణం.. ఆర్డినెన్స్ ఇచ్చి

నాఎన్నికలకు దూరమే..!



శ్రీకాకుళం: నేటి చరిత్ర


శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ రాజకీయ రంగు పులుముకుంది. చాలా కాలం తర్వాత రాజాం మేజర్ పంచాయతీ ని నగర పంచాయతీ గా ప్రభుత్వం అప్ గ్రేడ్

చేసి 16 సంవత్సరాలు అవుతున్నా..

ఈనగరపంచాయతీ వివాదం మళ్లీ హైకోర్టు

లో సుమారు 16 ఏళ్లుగా కొనసాగుతోంది.

వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం మేజర్ పంచాయతీ ని 2005లో నగరపంచాయతీ గా ఏర్పాటు చేస్తూ..16 సంవత్సరాల క్రితం అప్పటి గవర్నర్ ఆర్డినెన్స్ జారీచేశారు.దీన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో పలువురు హైకోర్టును ఆశ్రయించటంతో ఎన్నికలు నిలిచిపోయాయి. నగరపంచాయతీ ఏర్పాటు చేస్తూ అప్పట్లో ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపేసింది. తరువాత ప్రభుత్వం నగరపంచాయతీ ఏర్పాటుకు కావాల్సిన ప్రక్రియ పూర్తి చేయటంతో గవర్నర్‌ ఆర్డినెన్స్‌ ఇచ్చారు. దీంతో సమస్య పరిష్కారమైనట్లయింది. తాజాగా పొనుగుటివలస, కొత్తవలస, గోపాలపురానికి చెందిన పలువురు హైకోర్టులో కేసులు వేశారు. మార్చి 3న ఒక కేసు విచారణ జరుగగా

మరో కేసు ఈనెల 8 తేదీన విచారణ జరిగే అవకాశం ఉంది.ఓవైపు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ.. కోర్టులో పిటిషన్లు వేయటం తో ఈ సారి కూడా మున్సిపల్ ఎన్నికలకు రాజాం నగర పంచాయతీ నోచుకోక పోవడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసే 16 సంవత్సరాలు

అవుతున్న...స్థానికంగా నెలకొన్న రాజకీయ వర్గపోరు కారణంగా సాంకేతిక సమస్యలను కొందరు అడ్డం పెట్టుకొని 16 సంవత్సరాలు గా నగర పంచాయతీ కి ఎన్నికలు లేకుండా పోయాయి.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్