• Neti Charithra

Breaking.. నగదు చోరీకి..వచ్చి.. పెట్రోల్ తో ఏటీఎం కు నిప్పు.పెట్టి..న యువకుడు ఆత్మహత్య...!


Breaking.. నగదు చోరీకి..వచ్చి.. పెట్రోల్ తో

ఏటీఎం కు నిప్పు.పెట్టి..న యువకుడు ఆత్మహత్య...!



అనంతపురం: నేటి చరిత్ర


(పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఏటీఎం)


ఏటీఎం లో ఉన్న నగదును చోరీ చేందుకు వచ్చి..ప్రయత్నం విఫలం కావడంతో ఏటీఎం కు నిప్పు పెట్టి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా లో చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు...

అనంతపురం జిల్లా పరిగి మండలం

(ఆత్మహత్య చేసుకున్న మనోజ్)


కొడిగెనహళ్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇండియన్‌ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమవడంతో ఏటీఎం యంత్రాన్ని పెట్రోలు పోసినిప్పంటించారు. ఈ ఘటనలో ఏటీఎంలోని రూ.5.80 లక్షలు కాలి బూడిదయ్యాయి. గురువారం ఉదయం ఏటీఎంలో రూ.9 లక్షల నగదు ఉండగా.. ఖాతాదారులు రూ.3 లక్షలు డ్రా చేశారు. మిగతా రూ.5.80 లక్షలు ఏటీఎంలోనే ఉన్నాయి. అదే సమయంలో దుండగులు ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసి, చివరకు పెట్రోలు పోసి యంత్రాన్ని కాల్చివేశారు. శుక్రవారం ఉదయం పరిగి పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి ఏటీఎంలోకి ఇద్దరు వ్యక్తులు చొరబడినట్లు గుర్తించారు. వారిని

పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హిందూపురం పట్టణంలో గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో ఏటీఎంలో చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్న మనోజ్‌కుమార్‌(21) ఆబాద్‌పేటలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్