• Neti Charithra

Breaking.. నకిలీ.. మందుల అమ్మకాలు పై.. విజిలెన్స్..దాడులు.... పలు ఏజన్సీలు. సీజ్..!


Breaking.. నకిలీ.. మందుల అమ్మకాలు పై.. విజిలెన్స్..దాడులు.... పలు ఏజన్సీలు.

సీజ్..!


అమరావతి: నేటి చరిత్ర


నకిలీ మందుల అమ్మకాలపై ..ఏపీ ప్రభుత్వం పిడికిలి బిగిస్తోంది. పలు చోట్ల ప్రత్యేక బృందాలు దాడి చేసి పెద్దయెత్తున్న నకిలీ మందులు సీజ్ చేయగా పలు జిల్లాల్లో మూకుమ్మడి తనిఖీలు కు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం.వీటి కోసం స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేయాలని డ్రగ్స్‌ ఐజి రవిశంకర్‌ నారాయణను మంత్రి ఆళ్ల నాని

ఆదేశించారు. దీంతో కొన్ని టీంలను ఏర్పాటు చేసిన అధికారులు వివిధ డ్రగ్స్‌ సంస్థలపై సోదాలు నిర్వహించారు. విజయవాడలో హరిప్రియ ఫార్మా ఏజెన్సీ, పాలకొల్లులో లోకేశ్వరీ మెడికల్‌ ఏజెన్సీల్లో సోదాలు నిర్వహించారు. ఇక్కడ పెద్ద మొత్తంలో నకిలీ మందులను గుర్తించిన అధికారులు... ఈ రెండు ఏజెన్సీలను సీజ్‌చేశారు. చండీఘర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కేంద్రంగా నకిలీ మందుల రాకెట్‌ నడుస్తున్నట్లు గుర్తించారు.