- Neti Charithra
Breaking.. నకిలీ నోట్లు తయారీ చేస్తూ.. పోలీసులకు పట్టుపడ్డ SBI ఉద్యోగి..!
Breaking.. నకిలీ నోట్లు తయారీ చేస్తూ.. పోలీసులకు పట్టుపడ్డ SBI ఉద్యోగి..!
నేటి చరిత్ర: (నేటి చరిత్ర)
గుంటూరు జిల్లా మెడి కొండూరు లో
కలర్ జిరాక్స్ యంత్రం సాయంతో దొంగనోట్లు తయారు చేసి మార్పిడి చేస్తున్న ఇద్దరిని మేడికొండూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విలేకర్ల సమావేశంలో సీఐ ఆనందరావు మాట్లాడుతూగుంటూరు రూరల్
వెంగళాయపాలెంకు చెందిన షేక్ అహ్మద్ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆదుల్ గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో ఎక్స్టెన్షన్ కౌంటర్లో పనిచేస్తూ, ఖాళీ సమయంలో కంప్యూటర్లు మరమ్మతు చేస్తుంటాడు. కొన్నాళ్ల కిందట మేడికొండూరు మండలం తురకపాలెంకు చెందిన యువతితో వివాహమైంది. లాక్డౌన్ కారణంగా మండలంలోని పేరేచర్ల వచ్చిన అతడికి తురకపాలేనికి చెందిన బంధువు షేక్ కరిముల్లాతో పరిచయం ఏర్పడింది. కరిముల్లా విజయవాడలో టైలర్. మూడు నెలలుగా ఇద్దరు కలిసి పేరేచర్లలో రాత్రి వేళ కలర్ జిరాక్స్ యంత్రంతో 50, 100, 200, 500 నకిలీ నోట్లు తయారు చేశారు. దుకాణాల్లోకి వెళ్లి వృద్ధులు, చదువు రాని వారిని ఎంచుకొని వారి వద్ద ఏదో ఒక వస్తువు కొని
దొంగనోట్లను మార్చేవారు. అలా ఇప్పటి వరకు వారు తయారు చేసిన రూ.1.10 లక్షల విలువైన నకిలీ నోట్లలో రూ.96 వేల దాకా మార్పిడి చేశారు. పేరేచర్ల, గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాల్లో నకిలీ నోట్లను మార్చారు. జిరాక్స్ తీసేందుకు తెల్ల కాగితాల పుస్తకాన్ని వినియోగించారు. పోలీసులకు దీనిపై సమాచారం అందగా వీరి స్థావరంపై దాడి చేసి షేక్ అహ్మద్, షేక్ కరిముల్లాను అదుపులోకి తీసుకుని రూ.13 వేల విలువగల 54 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.