• Neti Charithra

Breaking.. ధాన్యం బస్తాలు చాటున..గంజాయి రవాణా..దాడులు చేసిన పోలీసులు..!


Breaking.. ధాన్యం బస్తాలు చాటున..గంజాయి రవాణా..దాడులు చేసిన పోలీసులు..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)


విశాఖ పోలీసులు.. నిఘా పెట్టి.. కోటి విలువైన గంజాయిని తరలిస్తున్న లారీ ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..

మాకవరపాలెం సమీపం లో

ధాన్యం బస్తాల మాటున తరలిస్తున్న రూ.కోటి విలువ జేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ

తూ.గో. జిల్లా రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాలకు చెందిన తీగల శేషు విశాఖ మన్యంలోని అన్నవరంలో ఉంటున్నారు. ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా పెదమునగాల్‌కు చెందిన చింతల సురేష్‌కు చెందిన వ్యానులో 55 బస్తాల్లో గంజాయిని లోడు చేసి, వాటిపై మరో 75 ధాన్యం బస్తాలు వేసి తీసుకువెళుతున్నారు. మాకవరపాలెం తహసీల్దారు కార్యాలయం ఎదుట పోలీసులు గురువారం ఈ వ్యానును పట్టుకున్నారు. జి.మాడుగుల మండలం కరకపల్లిలో 2,200 కేజీల గంజాయిని రూ.50 లక్షలకు కొనుగోలు చేశారని సీఐ చెప్పారు. దీనివిలువ మార్కెట్‌లో రూ. కోటి ఉంటుందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్సైలు కరక రాము, సన్యాసిరావు పాల్గొన్నారు.