• Neti Charithra

Breaking.. దాహం..అంటూ ఇంట్లోకి చొరబడి మహిళపై సామూహిక అత్యాచారం..ఆపై సజీవ దహనం..!


Breaking.. దాహం..అంటూ ఇంట్లోకి చొరబడి మహిళపై సామూహిక అత్యాచారం..ఆపై సజీవ దహనం..!



నేటి చరిత్ర: ప్రత్యేక ప్రతినిథి


తాగేందుకు నీళ్లు ..కావాలంటూ కొందరు ఆగంతకులు ఓ మహిళ పై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై సజీవ దహననికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్ లో బుధవారం

సంచలనం కలిగించింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్ధి జిల్లాలోని అమిలియా గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు కీచకులు ఒంటరిగా ఉన్న వితంతువు(45) ఇంటికి వచ్చారు. దాహంగా ఉంది నీళ్లు ఇవ్వాలని కోరగా...ఆమె ఇంటి లోపల ఉండే అందించబోయింది. బయటకు వచ్చి

ఇవ్వాలని గద్దించటంతో ఆమె తిరస్కరించింది. తలుపును తోసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేశారు. ఇనుప రాడ్డును జననాంగంలోకి చొప్పించి వికృతంగా రాక్షసానందం పొందారు. బాధతో విలవిలలాడిపోతూ ఆమె పెట్టిన కేకలు విన్న పొరుగు వారు, బంధువులు అక్కడకు చేరుకునే సరికి దుండగులు పారిపోయారు. బాధితురాలిని సిద్ధి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రేవా డీహెచ్‌హెచ్‌కు తరలించారు. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.