• Neti Charithra

Breaking.. దేశ సరిహద్దు లో వీర మరణం పొందిన సైనికుడు..చిత్తూరు జిల్లా లో విషాద ఛాయలు..!


Breaking.. దేశ సరిహద్దు లో వీర మరణం పొందిన సైనికుడు..చిత్తూరు జిల్లా లో విషాద ఛాయలు..!




చంద్రగిరి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కు చెందిన ఓ సైనికుకుడు

దేశ సరిహద్దు లో విధులు నిర్వహిస్తూ వీర మరణం పొందటంతో స్వగ్రామం లో విషాద ఛాయలు అలుము కున్నాయి. ఇందుకీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 ఏళ్లుగా భారత సైనిక దళంలో జవానుగా విధులు

నిర్వహిస్తున్నాడు. అయితే విధుల్లో భాగంగా సరిహద్దుల్లో శనివారం పహారా కాస్తుండగా చలితీవ్రత ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సహచర జవానులు గుర్తించి వెంటనే హెలికాప్టర్‌లో ఆర్మీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే రెడ్డప్పనాయుడు మృతి చెందాడని ఆర్మీ వైద్యులు ధ్రువీకరించారు. సైనికుని పార్థిక దేహాన్ని స్వగ్రామం కు తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.