- Neti Charithra
Breaking..దేశ వ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతం.. స్తంభించిన జాతీయ రహదారులు..!
Breaking.. దేశ వ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతం.. స్తంభించిన జాతీయ రహదారుల..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ బంద్‌కు మంగళవారం
దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి బంద్‌లో పాల్గొన్నాయి.
ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళ నాడు రాష్ట్రాల్లో భారత్ బంద్ విజయవంతం అవుతోంది. పలు
రాజకీయ పార్టీలు, వ్యవసాయ, కార్మిక సంఘాలతో పాటు వివిధ కార్మిక, వ్యాపార, వాణిజ్య సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళా సంఘాలు అన్నదాతకు మద్దతుగా కదిలాయి. దీంతో దేశవ్యాప్తంగా బంద్‌కు అపూర్వమైన రీతిలో మద్దతు లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన బంద్‌లో భాగంగా ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరగనున్నాయి.
112 views0 comments