• Neti Charithra

Breaking.. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ విజయవంతం..రాష్ట్రాల వారీగా..!


Breaking.. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ విజయవంతం..రాష్ట్రాల వారీగా..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


భారత్‌లో చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ప్రపంచంలోనే అతి పెద్ద పంపిణీ కార్యక్రమం

అని తొలి రోజు కార్యక్రమం విజయవంతం అయ్యిందని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగ

భరిత ప్రసంగం చేశారు. ఏడాది పాటు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న ఉక్కు లక్ష్యం ఉన్న ప్రజలుగా దేశ ప్రజలను ప్రధాని కొనియాడారు.

తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.



(రాష్ట్రాల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఆయిన వివరాలు)


ఈ రోజు టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టంచేసింది. శనివారం 3351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని తెలిపింది. అయితే, కొవిన్‌ యాప్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆలస్యమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్‌, మరో 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ టీకా వేసినట్టు తెలిపింది.