• Neti Charithra

Breaking.. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం..లారీ తోపాటు ఇద్దరు సజీవదహనం!


Breaking..దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం..లారీ తోపాటు

ఇద్దరు సజీవ దహనం..!



అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం

జరిగింది. లారీని ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదం లో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు..యాడికి మండలం బోగలకట్టకు చెందిన రోశిరెడ్డి(65),

నారాయణరెడ్డి(45) గుత్తి సమీపంలోని బాట సుంకులమ్మ దేవాలయానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి గ్రామానికి వస్తుండగా గుత్తి మండలం ఎంగిలిబండ-కొత్తపేట మధ్య ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదం తీవ్రతకు ద్విచక్ర వాహనంలోని పెట్రోలు బయటికి వచ్చేసింది. వెంటనే మంటలు చెలరేగి రోశిరెడ్డి,

నారాయణరెడ్డికి అంటుకున్నాయి. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో లారీ సైతం పాక్షికంగా, ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనఫై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు