• Neti Charithra

Breaking.. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. ఘోర ప్రమాదం.. నలుగురు మృతి..!


Breaking.. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..

ఘోర ప్రమాదం.. నలుగురు మృతి..!



ఒంగోలు: నేటి చరిత్ర


దైవ దర్శనానికి వెళ్తూ.. ఘోర

రోడ్డు ప్రమాదం లో నలుగురు మృతి చెందిన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.శ్రీశైలం మల్లన్న దర్శనానికి కారులో వెళ్లి తిరిగి వస్తున్న నలుగురు మిత్రులు రోడ్డు ప్రమాదంలో

మృతి చెందారు.మరో మిత్రుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్‌ సమీపంలో చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న పాలడుగు మధుకర్‌ (58), పెద్ది సురేష్‌ (63), కొండు పాండురంగారావు (56) దుర్ఘటన స్థలంలోనే మృతి చెందారు. తాళ్లూరి సురేష్‌ (50) మార్కాపురం వైద్యశాలలో మరణించారు. పాగుర్తి కృష్ణకు తీవ్ర గాయాలవడంతో గుంటూరుకు తరలించారు.