• Neti Charithra

Breaking...ద్విచక్ర వాహనం లో వెళుతుండగా చిత్తూరు జిల్లాలో దారుణ హత్య..!


Breaking...ద్విచక్ర వాహనం లో వెళుతుండగా చిత్తూరు జిల్లాలో దారుణ హత్య..!


పీలేరు: నేటి చరిత్ర


పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా కత్తులతో దాడి చేసి నరికి చంపిన సంఘటన చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలంలో కలకలం రేపింది.పోలీసుల కథనం మేరకు..కలికిరి మండలం నాయనచెరువుపల్లెకు చెందిన రాఘవ రెడ్డి కుమారుడు వెంకటేశ్వర రెడ్డి (44)తో అదే గ్రామానికి చెందిన సిద్ధారెడ్డికి

(దారుణ హత్యకు గురైన వెంకటేశ్వర రెడ్డి)


మధ్య పాత కక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుడు వెంకటేశ్వర్‌ రెడ్డి 2004లో సిద్ధారెడ్డిపై కలికిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించాడని, అలాగే 2014లో ఎల్లయ్య అనే వ్యక్తి ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టించాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కేసు హియరింగ్‌ కు రావడంతో సిద్దారెడ్డి ఎల్లయ్య తో రాజీ యత్నం చేసుకుని కేసు మాఫీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడని తెలిసుకున్న వెంకటేశ్వర్‌ రెడ్డి రాజీ పోవద్దంటూ ఎల్లయ్యకు చెప్పి అడ్డు పడుతున్నట్లు సిద్ధారెడ్డికి అనుమానం కలిగే హత్యకు కుట్రపన్ని ఉండొచ్చని అనుమానం. దాంతో శనివారం రాత్రి వెంకటేశ్వర రెడ్డి మద్దెలచెరువు మార్గంలో తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గంమధ్యలో బడినాయునిదొడ్డి వద్ద కాపుకాచి ప్రత్యర్థులో కర్రలు, కత్తులతో దాడిచేయించి దారుణంగా హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.