• Neti Charithra

Breaking.. ద్విచక్ర వాహనాలను ఢీకొన్న పాల ఆటో.. రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి..!



Breaking.. ద్విచక్ర వాహనాలను ఢీకొన్న పాల ఆటో.. రోడ్డు ప్రమాదం లో

ఇద్దరు మృతి..!




అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.

రాయదుర్గం సమీపం లోని జుంజురాంపల్లి గ్రామ సమీపంలోని మల్లేశ్వరస్వామి కొండ వద్ద ర.భ. ప్రధాన రహదారిలో

మంగళవారం రాత్రి పాల ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు, గ్రామ ప్రజలు తెలిపిన వివరాల మేరకు.. జుంజురాంపల్లి నుంచి రాయదుర్గం వైపు పాలు తీసుకెళ్తున్న ఆటోను జుంజురాంపల్లి వైపు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు చీకట్లో ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో

మలకాపురం గ్రామానికి చెందిన శ్రీపతి (48) అనేవ్యక్తి అక్కడికక్కడే మరణించగా, చిత్తయ్య అనేవ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.