• Neti Charithra

Breaking.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ..ఘోర ప్రమాదం లో ఇద్దరు మృతి..!


Breaking.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ..ఘోర ప్రమాదం లో

ఇద్దరు మృతి..!



గుంటూరు: నేటి చరిత్ర


ద్విచక్ర వాహనాన్ని.. లారీ ఢీకొనడం తో ఇద్దరు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాల్లో విషాదాన్ని మిగిల్చింది.మాచవరం పోలీసుల కథనం మేరకు..కానూరు మురళీనగర్‌కు చెందిన నక్కా రాజు(26), స్నేహితుడు కురేటి శివరామ్‌ (17)తో కలసి ద్విచక్రవాహనంపై నున్న బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం రామవరప్పాడు రింగ్‌ నుంచి ఇన్నర్‌ రింగు రోడ్డుపై వెళుతుండగా, మలుపులో వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి, వారిని ఢీకొట్టింది. వాహనాన్ని నడుపుతున్న రాజు తల పైనుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న శివరామ్‌కు తీవ్ర గాయాలవడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రి పంపగా, చికిత్స పొందుతూ రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్‌ పరారీ అయ్యాడు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్