• Neti Charithra

Breaking... ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు..వాలంటీర్ తో పాటు ముగ్గురు మృతి..!


Breaking... ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు..వాలంటీర్ తో పాటు ముగ్గురు మృతి..!


నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)

ఘోర ప్రమాదం ముగ్గురు ప్రాణాలు తీసింది.

ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ళ దగ్గర బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒంగోలులో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు, సొంత గ్రామం అయిన

హనుమంతునిపాడు మండలం వాలిచర్లలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కార్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాలంటీర్‌ నాగరాజుతో సహా, అతని తల్లి, వదిన స్పాట్ లోనే ప్రాణాలొదిలారు. మృతులను నాగరాజు (30), తల్లి కొక్కెర పొలమ్మ (55), వదిన మల్లేశ్వరి (35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.