• Neti Charithra

Breaking.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ఇద్దరు మృతి..!


Breaking.. ద్విచక్ర

వాహనాన్ని ఢీకొన్న కారు ఇద్దరు మృతి..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


మచిలీపట్నం సమీపం కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడుమోలు జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో మంగళవారంఇద్దరు మృతి చెందారు.

పల్సర్ బైక్ పై మచిలీపట్నం నుండి విజయవాడ వైపుకు వెడుతున్న ముగ్గురు వ్యక్తులు స్థానిక మసీదు వద్ద అదే

రహదారిపై విజయవాడకు వస్తున్న ఇండికా కారు పల్సర్ బైక్ ను వెనుక వైపుగా ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వారు అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో కలపటం గ్రామoకు చెందిన మద్దాల శ్రీను ప్రమాద స్థలంలోనే మృతిచెందడం జరిగింది. ఇదే బైక్ పై ప్రయాణిస్తూ గాయపడి హాస్పిటల్ కు తరలిస్తుండగా పెనుగుడి గ్రామానికి చెందిన ఎం డి ఇంతియాజ్ మార్గ మద్యంలోనే మృతి చెందడం జరిగింది.ఇదే బైక్ పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడటం జరిగింది. అప్పటికే

సంఘటనా స్థలానికి చేరు కున్న కూచిపూడి ఎస్ ఐ తో కూడిన సిబ్బంది ప్రమాదానికి కారణమైన ఇండికా కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రమాద సంఘటన పై విచారణ జరుపుతున్నారు.


330 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon