- Neti Charithra
Breaking.. ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న ఆర్టీసీ బస్సు..ఒకరి మృతి..!
Breaking.. ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న ఆర్టీసీ బస్సు..ఒకరి మృతి..!
కడప: నేటి చరిత్ర
(రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వ్యక్తి)
కడపజిల్లా రాజంపేట మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఊటుకూరు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి
చెందాడు. మన్నూరు పోలీసుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి కడపకు వస్తున్న సమయంలో రాజంపేట మండలం మన్నూరుకు చెందిన బాలు(26) అనే యువకుడు ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఊటుకూరు వద్దకు రాగానే బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో బాలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి
చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
319 views0 comments