• Neti Charithra

Breaking..ద్విచక్రవాహనాలు చోరీచేసే ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..చిత్తూరు జిల్లాలో పట్టుపడ్డ ముఠా!


Breaking..ద్విచక్రవాహనాలు చోరీచేసే ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..చిత్తూరు జిల్లాలో పట్టుపడ్డ ముఠా!



శ్రీకాళహస్తి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ముఠా సభ్యులను

బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్పీ సుబ్బన్న కథనం మేరకు..



తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి రమేష్ రెడ్డి ఐ.పి.యస్ ఆదేశాల మేరకు

శ్రీ కాళహస్తి వన్ టౌన్ సి.‌ఐ D.నాగార్జున రెడ్డి తన సిబ్బందితో వాహనములు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్రవాహనములను ఆపే ప్రయత్నం చేయగా వారు

వాహనములను వదిలి పారిపోతుండగా పోలీసులు చుట్టి ముట్టి ముగ్గురిని

అదుపులోకి తీసుకున్నారు.

వారు విచారణ లో ముగ్గురు నిందితులు ను విచారించగా అడపా విజయకుమర్, .కయ్యూరి శశికిరణ్,పులివర్తి భాస్కర్ లు

వ్యసనాలకు బానిసై, విలాసాలకు అలవాటుపడి దొంగతనము చేయాలనే సంకల్పంతో శ్రీ కాళహస్తి పట్టణములో ఈ రెండు వాహనములను దొంగతనము చేశామని, గత సంవత్సర కాలముగా మాతో పాటు 4.యువరాజు కూడా కలిసి తిరుపతి, నెల్లూరు, తమిళనాడు మరియు ఇతర ప్రాంతాలలో దొంగతనాలు చేసిన 13 ద్విచక్రవాహనములను చూపించడం జరిగినది. వాహనములు గురించి విచారించగా తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో 1, వెస్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో 1, అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలో 2, నెల్లూరు 5 టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో 1 మరియు తమిళనాడు లలో దొంగతనము చేసామని, లాక్ డౌన్ కారణముగా వాహనములు

అమ్మలేకపోయాము అని తెలిపారన్నారు.

ముగ్గురు దొంగలనుండి 15 ద్విచక్రవాహనములను స్వాదీనము చేసుకొని రిమాండుకు తరలించినట్లు పోలీసులు వివరించారు. మరో నిందితుడు యువరాజు పరారీ లో ఉన్నట్లు తెలిపారు. కాగ నిందితులనుంచి రూ.20 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్