- Neti Charithra
Breaking.. ద్విచక్రవాహనాని కి లక్షకు పైగా జరిమానా విధించిన అధికారులు..!
Breaking.. ద్విచక్రవాహనాని కి
లక్షకు పైగా జరిమానా విధించిన అధికారులు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
అతను నడుపుతున్నది.. ద్విచక్రవాహణం ...వాహనానికి రికార్డులు లేవు.. ప్రయాణం చేసే సమయం లో హెల్మెట్ కూడా లేదు.. అయితే.. జిల్లాలు జిల్లాలు తిరిగి వ్యాపారం చేస్తున్న ఓ యువకుడికి రికార్డు స్థాయిలో అధికారులు
రూ. 1.13 లక్షలు జరిమానా విధించిన ఘటన ఓడిశా రాష్ట్రం లో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.ఒడిశాలోని రాయగడ డీవీఐ కూడలి వద్ద బుధవారం పోలీసులు, ఆర్టీవో సిబ్బంది తనిఖీల్లో భాగంగా.. ప్లాస్టిక్ డ్రమ్ముల వ్యాపారం చేసే, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్ బంజారను ఆపారు. అతడు తన వాహనానికి 8 డ్రమ్ములు కట్టుకుని వెళ్తున్నాడు. దీంతో పత్రాలు అడగ్గా ప్రకాశ్ ఏమీ చూపించలేకపోయాడు. తనిఖీ చేయగా వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించలేదని, ఏ విధమైన పత్రాలూ లేవని గుర్తించారు. దీంతో భారీ మొత్తంలో జరిమానా విధించారు. ఇటీవల కాలం లో ఇలాంటి భారీ జరిమానా విధించడం తొలిసారే నని పలువురు అంటున్నారు.