• Neti Charithra

Breaking...దుర్గాదేవి ఆలయం లో ఏసీబీ తనిఖీలు..13 మంది ఉద్యోగులపై వేటు వేసిన ప్రభుత్వం..!


Breaking...దుర్గాదేవి ఆలయం లో ఏసీబీ తనిఖీలు..13 మంది ఉద్యోగులపై వేటు వేసిన ప్రభుత్వం..!


అమరావతి: నేటి చరిత్ర


అవినీతి నిరోధక శాఖఅధికారులు

దాడుల ఫలితంగా విజయవాడ దుర్గగుడిలో 13 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నాలుగు

రోజులు జరిపిన సోదాల్లో అనేక విభాగాల్లో అవినీతి జరిగిందని తేలింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అన్నదానం, చీరల విక్రయాలు వంటి చోట్ల పెద్దయెత్తున అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంజనీరింగ్ శాఖలో కూడా అవినీతి ఉందని తేల్చింది. దీంతో దుర్గగుడిలో వివిధ శాఖలకు చెందిన 13 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది