• Neti Charithra

Breaking.. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లి.. రూ.14 లక్షల కారు దగ్ధం...!


Breaking.. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లి.. రూ.14 లక్షల కారు దగ్ధం...!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు కొత్తకారు తో వెళ్లిన సందర్భంగా కారు పై టపాసులు పడి రూ.14 లక్షల కారు దగ్ధం అయిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తొండుపల్లిలో చోటుచేసుకుంది. శంషాబాద్‌ పోలీసుల

కథనం మేరకు.. శంకర్‌పల్లి మండలం, మోకిలకు చెందిన ఓ యువకుడు కొత్తగా కొనుగోలు చేసిన కారును తీసుకుని

తొండుపల్లికి వెళ్లాడు. స్నేహితుడి ఇంటి వద్ద పార్కింగ్‌ చేశాడు. అదే బస్తీకి చెందిన వేణు భారీ(సుత్లీ బాంబు) టపాసులను కాల్చి కారుపైకి పారేయడంతో నిప్పంటుకుంది. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడంతో కారు పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.