• Neti Charithra

Breaking.. దోపిడీ కథ అల్లి.. పెన్షన్ డబ్బులు మింగేసిన గ్రామ వాలంటీర్..!


Breaking.. దోపిడీ కథ అల్లి.. పెన్షన్ డబ్బులు మింగేసిన గ్రామ వాలంటీర్..!




మడకశిర: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా మడకశిర లో

పింఛను సొమ్ము దొంగలు దోచుకెళ్లారని ఓ వాలంటీరు అల్లిన కట్టుకథను కొన్ని

గంటల్లోనే పోలీసులు బట్టబయలు చేశారు. గురువారం తెల్లవారుజామున 5గంటలకు పింఛను పంపిణీ చేయడానికి వెళ్తుండగా

గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి తనపై దాడి చేసి రూ.43,500 సొమ్ము దోచుకెళ్లారని మడకశిర శివాపురం వార్డు వాలంటీరు ఈరప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ రాజేంద్రప్రసాద్‌, ఎస్సై రాజేష్‌ పలు కోణాల్లో వాలంటీరును విచారించి గుట్టురట్టు చేశారు. వాలంటీరు బుధవారం సాయంత్రమే పింఛను సొమ్ము ఖర్చు చేశాడు. ఉన్నతాధికారులకు తెలిస్తే ఉద్యోగం పోతుందని నాటకమాడినట్లు

విచారణలో తేలింది. అనంతరం వాలంటీరు బంధువులు సొమ్ము ఇవ్వడంతో లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ నాగార్జున, మేనేజర్‌ నరసింహులు తెలిపారు. కాగ ఆ వాలంటీర్ ను విధులనుంచి తొలగించినట్లు ప్రకటించారు.