• Neti Charithra

Breaking... తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన దోపిడీ కేసును ఛేదించి చిత్తూరు పోలీసులు..!


Breaking... తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన దోపిడీ కేసును ఛేదించి చిత్తూరు పోలీసులు..!




చిత్తూరు: నేటి చరిత్ర


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్ ల దోపిడీ కేసును చిత్తూరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. జిల్లా ఎస్పీ సింథిల్ కుమార్


(చిత్తూరు లో మీడియా సమావేశం లో మాట్లాడుతున్న ఎస్పీ సెంథిల్ కుమార్)


పర్యవేక్షణలో నెల రోజులు పాటు కేసును ప్రత్యేక పోలీస్ బృందాలు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్ లను రికవరీ చేశారు. ఈ కీలక కేసులో ప్రతిభ చూపిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

ఎస్పీ సింథిల్ కుమార్ కథనం మేరకు...



(రూ.8 కోట్ల సెల్ ఫోన్ లను రికవరీ చేసిన పోలీసు అధికారులు)


ఆగష్టు 25 వ తేదిన నగరి-పుత్తూరు రహదారిలో సెల్ ఫోన్ల లోడ్ తో వెళ్తున్న కంటైనర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి సుమారు రూ. 8 కోట్లు విలువైన సెల్ ఫోన్ల బాక్సులను దొంగలించారు. ఈ కేసు ఛేదనను ఛాలెంజ్ గా తీసుకొన్న చిత్తూరు జిల్లా ఎస్.పి శ్రీ ఎస్.సెంథిల్ కుమార్, IPS 3 దర్యాప్తు బృందాలను ఏర్పరచి చిత్తూరు

జిల్లా నుంచి బంగ్లాదేశ్ బార్డర్ వరకు ఆపరేషన్ ను నిర్వహించి మధ్యప్రదేశ్ రాష్ట్రం నందు దేవాస్ జిల్లా థానేఘాటి గ్రామం నందు కంజరభట్ ముఠా సభ్యులపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆకస్మిక దాడులు జరిపిన 3 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి దారి దోపిడి కాబడిన రూ. 8 కోట్ల మొబైల్ ఫోన్ల ను రికవరీ చేసుకొని ట్రాన్సిట్ వారెంట్ పై చిత్తూరు కు తీసుకోని రావడం జరిగిందన్నారు.

25-08-2020 వ తేది రాత్రి 8.40 గం.ల సమయం లో శ్రీ పెరంబదూరు నందు గల Flex Tronics Company నుండి XIAOMI మొబైల్ ఫోన్ల లోడ్ ను డ్రైవర్ ఇర్ఫాన్ MH 04 HD 6477 నెంబరు గల కంటైనర్ లో భివాండి కి పోతూ తిరుత్తణి RTO చెక్ పోస్ట్ దాటిన తర్వాత నగరి మండల పరిధిలో బోర్డర్ దాటిన తర్వాత మూడు లారీ ల లో గుర్తు తెలియని దుండగులు వెంబడిస్తూ అందులోని Eicher Vehicle సెల్ ఫోన్ లారీ ని ఓవర్ టేక్ చేసుకుని ముందుకు వెళ్లి నిలిపి డ్రైవర్ ను అడ్రెస్స్ అడిగే నెపంతో, నటిస్తూ వెనుక లారీ లో ఉన్న దుండగులు బలవంతంగా కంటైనర్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్లి డ్రైవర్ పై దాడి చేసికొద్ది దూరం కంటైనర్ ని తీసుకుని వెళ్లి, కంటైనర్ లో ఉన్న సెల్ ఫోన్ల ను తమ వాహనాల్లోకి మార్చుకుని దోచుకొని వెళ్ళినారు..


• వీరంతా ఉత్తరప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా మొదలగు రాష్ట్రాలలో హై వే DACOIT లు చేస్తుంటారు. వీరిపై మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా లలో కేసులు కలవు. 29-09-2020 వ తేది నగరి ఇన్స్పెక్టర్ శ్రీ K. మద్దయ్య చారి , పీలేరు టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ S. సాదిక్ అలీ, నగరి రూరల్ CI శ్రీ M. రాజశేఖర్ మరియు, SI బంగారుపాళ్యం, V. రామకృష్ణయ్య, SI నగరి U. ప్రతాప్ రెడ్డి, పుత్తూరు SI లు P. మల్లికార్జునరెడ్డి, రామాంజనేయులు, బైరెడ్డి పల్లి SI మునసామి మరియు సిబ్బంది తెల్లవారు జామున 5.30 AM గంటలకు దేవస్ దగ్గర అరెస్ట్ చేసి 7522 సెల్ ఫోన్ లు రికవరీ చేసి, ఒక లారీ, మూడు ద్విచక్ర వాహనాలు వారివద్ద నుండి రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.