• Neti Charithra

Breaking..తెలుగు రాష్ట్రాల్లో సంచలనంకలిగించిన తొమ్మిది మంది హత్యకేసులోసంచలన తీర్పుఇచ్చిన న్యాయస్థానం


Breaking.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన తొమ్మిది మంది హత్యకేసులో సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన

వరంగల్ జిల్లా గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ

వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయ్‌కుమార్ తీర్పు ప్రకటించారు. గత మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే సంజయ్ బావిలో పడేశాడు. తెల్లారి వరుసగా 9 మంది మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు.  25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు. 57మంది మంది వాంగ్మూలం నమోదు చేశారు. ఒక హత్యను

కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షంవ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా కేసులో కీలక సాక్షాలు సేకరించిన పోలీస్ అధికారులు కు పలువురు అభినందించారు.