• Neti Charithra

Breaking..తెలుగుయువత అధ్యక్షులుశ్రీరామ్ చినబాబు నుఅదుపులోకి తీసుకున్న పోలీసులు..మదనపల్లె లో ఉద్రిక్త


Breaking.. తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..మదనపల్లె లో ఉద్రిక్తత



మదనపల్లె: నేటి చరిత్ర


( పోలీసుల వైఖరిని నిరసిస్తూ నిరసనకు దిగిన చినబాబు)

చిత్తూరు జిల్లా మదనపల్లె లో టీడీపీ రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె లోని 33 వ వార్డు పరిధి లోని వివేకానంద స్కూల్ పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ సరళిని

పరిశీలించేందుకు శ్రీరామ్ చినబాబు రావడంతో పోలీసులకు వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు శ్రీరామ్ చినబాబు ను అదుపు లోకి తీసుకొని హౌస్ అరెస్ట్ చేశారు. దింతో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డు పై భైఠాయించి నిరసన కు దిగారు. దింతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న డిఎస్పీ రవి మనోహర చారి, సీఐ అశోక్ కుమార్ లు అక్కడికి చేరుకొని శ్రీరామ్ చినబాబు ను సముదాయించటం తో వివాదం సద్దు మణిగింది.