• Neti Charithra

Breaking.. తెలుగుదేశం పార్టీ కి నోటీసులు పంపిన దేశ అత్యున్నత న్యాయస్థానం..!



Breaking.. తెలుగుదేశం పార్టీ కి నోటీసులు పంపిన దేశ అత్యున్నత న్యాయస్థానం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయం భూకేటాయింపు లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి భూ కేటాయింపులపై

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఆర్డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించి నీటి వనరులతో సంబంధం ఉన్న భూమిని కేటాయిస్తూ 2017లో జీవో జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌

నారీమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.