- Neti Charithra
Breaking.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్లెలు..ఎమ్మెల్సీల భారీ ర్యాలీ..!
Breaking.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్లెలు..ఎమ్మెల్సీల భారీ ర్యాలీ..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
ఏపీ రాజధాని అమరావతి లో టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు నిరసర ర్యాలీ చేశారు.
వెంకటా పాలెం లో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు నివాళులు అర్పించారు.
అనంతరంపంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వరి కంకుల్ని చేతబట్టి టీడీపీ నేతలు సచివాలయం సమీపంలో నిరసన తెలిపారు. శాసనసభ
సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల తరఫున ఆందోళనలు చేశారు. అన్నదాతలకు
కలిగిన నష్టాన్ని
తెలిపే రీతిలో వర్షానికి దెబ్బతిన్న పంట కంకులతో కూడిన బ్యానర్లు ప్రదర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని
డిమాండ్ చేశారు. ఉద్యాన పంటలకు రూ.50 వేలు, ముంపు బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అనంతరం అసెంబ్లీకి సమావేశాలకు వెళ్లారు.