- Neti Charithra
Breaking.. తెలుగుదేశం నేత ను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు..!
Breaking..
తెలుగుదేశం నేత ను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు..!
గుంటూరు: నేటి చరిత్ర
గుంటూరు జిల్లా దాచేపల్లిలో దారుణ హత్య జరగడం కల కలం రేపింది. తెలుగుదేశం పార్టీ నేత ఆదివారందారుణ హత్యకు గురయ్యాడు. సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లో తెలుగుదేశం పార్టీ నేతను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకుల్ ను కొందరు దుండగులు హత్య చేశారు. పెదగార్లపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచిగా పదిహేను సంవత్సరాలు పని
(హత్యకు గురైన పురంసెట్టి అంకుల్)
చేశారు పురంశెట్టి అంకుల్. కన్స్ట్రక్షన్ జరుగుతున్న అపార్ట్మెంట్లో గొంతుకోసి హత్య చేశారు. వైసీపీ నేతలే ఆయన్ను చంపారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఘటన స్థలానికి వచ్చి పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
598 views0 comments