• Neti Charithra

Breaking.. తిరుపతి పార్లమెంట్ బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి పేరు ప్రకటించిన బిజెపి అధిష్టానం..!


Breaking.. తిరుపతి పార్లమెంట్ బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి పేరు ప్రకటించిన బిజెపి అధిష్టానం..!



తిరుపతి: నేటి చరిత్ర



బిజెపి-జనసేన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఉమ్మడి అభ్యర్థి గా మాజీ ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ పేరును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌

ప్రకటించారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభకు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ సీఎస్‌గా పని చేసిన రత్నప్రభ ప్రజలకు ఎంతో సేవ చేశారని తిరుపతి పార్లమెంట్ ఎంపీ గా రత్న ప్రభ ను గెలిపిస్తే మరింత అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.