- Neti Charithra
Breaking.. తిరుపతి నేతలకు "కీలక" ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు..!
Breaking.. తిరుపతి నేతలకు "కీలక" ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
( స్థానిక నేతలతో సమావేశం ఆయిన టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు.
అమరావతి నుంచి ఆయన తిరుపతి ఉపఎన్నికల బాధ్యులతో మాట్లాడుతూ
ఈ నెల 17 నుంచి టీడీపీ ఉపఎన్నిక ప్రచారానికి సిద్ధం కావాలని సూచించారు. 9 నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. 17 నుంచి 27 వరకు నాయకులు, ఇంచార్జ్‌లు పర్యటించి పార్టీ తరపున ప్రచారం
చేయాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లోకేశ్‌తో పాటు తానూ పర్యటిస్తామన్నారు. గ్రామ, మండల స్థాయిలో 70 మంది సీనియర్లకు ఉపపోరు బాధ్యతలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.
మరోవైపు తిరుపతి ఉప ఎన్నికపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రవెూహన్రెడ్డి నివాసంలో టీడీపీ సీనియర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. బయట నుంచి ఇన్‌చార్జ్‌లను తిరుపతికి పంపాలని, 10 బూత్‌లకు ఒక ఇన్ఛార్జ్ను నియమించాలని నిర్ణయించారు