• Neti Charithra

Breaking.. తిరుపతి తోపాటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు మ్రోగిన ఎన్నికల షెడ్యూల్..!


Breaking.. తిరుపతి తోపాటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు మ్రోగిన ఎన్నికల షెడ్యూల్..!


తిరుపతి: నేటి చరిత్ర


దేశవ్యాప్తంగా ఖాళీ ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏఫ్రిల్ 17న పోలింగ్, మే2న ఫలితాలను వెల్లడించనున్నారు.తెలంగాణలోని నాగార్జున సాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏప్రిల్‌ 17న తిరుపతి లోక్‌సభ స్థానానికి సైతం ఎన్నికల నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.