- Neti Charithra
Breaking.. తిరుపతి అర్బన్ ఎస్పీ గా వెంకట అప్పుల నాయుడిని నియమించిన ప్రభుత్వం..!
Breaking.. తిరుపతి అర్బన్ ఎస్పీ గా వెంకట అప్పుల నాయుడిని నియమించిన ప్రభుత్వం..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ ఎస్పీగా వెంకట అప్పల నాయుడిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ విధులు నిర్వ హిస్తున్న రమేష్ రెడ్డి ని ఎన్నికల సంఘం సూచనలు మేరకు..ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానం లో2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన 2013 -15 మధ్య గ్రేహౌండ్స్ అసాల్డ్ కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. తర్వాత అదనపు ఎస్పీగా జమ్మలమడుగు, గుంటూరు అర్బన్‌లో పనిచేశారు. అనంతరం రాష్ట్ర పోలీసు శాఖ ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా సేవలందించారు. విజయవాడ డీసీపీ - 2గా ఉన్నారు. గుంటూరు రూరల్ ఎస్పీగా పనిచేశారు. అనంతరం చిత్తూరు జిల్లా ఎస్పీగా కొంతకాలం పనిచేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ (ఐఎస్‌డబ్ల్యూ) ఎస్పీగా సేవలందిస్తున్నారు. తాజాగా ఆయన్ను తిరుపతి అర్బన్ ఎస్పీ గా బదిలీ చేశారు.