• Neti Charithra

Breaking.. తొమ్మిదేళ్లు తనతో నడిచిన భార్య ..గొంతు కోసిన భర్త..చిత్తూరు జిల్లా లో దారుణం..!


Breaking.. తొమ్మిదేళ్లు తనతో నడిచిన భార్య ..గొంతు కోసిన భర్త..చిత్తూరు జిల్లా లో దారుణం..!


పుంగనూరు: నేటి చరిత్ర


తొమ్మిది ఏళ్ళు.. తనతో నడిచిన భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు లో చోటు చేసుకుంది. పుంగనూరు మండలంలోని కంగానెల్లూరుకు చెందిన హిమబిందు (27), సురేష్‌ తొమ్మిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి మనస్వీతేజ (6), జతిన్‌కుమార్‌(4) పిల్లలు. రెండేళ్లుగా

(తల్లి లేని పిల్లలు గా మారిన చిన్నారులు)


వరకట్నం కోసం, ఆమె పుట్టింటికి చెందిన

ఆస్తుల కోసం భర్త వేధించేవాడు. పలుసార్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా మధ్యస్థంతో తిరిగి కలుసుకునేవారు

కొద్ది రోజులుగా అద్దెఇంట్లో ఉంటున్నారు. అతనిలో మార్పురాకపోగా శనివారం రాత్రి గొడవపడి కత్తితో ఆమె గొంతుకోయడమే గాకుండా ఒంటిపై పలుచోట్ల కోసేశాడు.

దింతో ఇద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యారు.సీఐ ప్రసాద్‌బాబు, ఎస్సై ఉమామహేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.