- Neti Charithra
Breaking... తొమ్మిది లక్షల బంగారు పై.. కన్ను.. వేసి.. పోలీసులకు..చిక్కిన మరో ఇద్దరు పోలీసులు..!
Breaking... తొమ్మిది లక్షల బంగారు పై.. కన్ను.. వేసి.. పోలీసులకు..చిక్కిన మరో ఇద్దరు పోలీసులు..!
అనంతపురం: నేటి చరిత్ర
బెదిరించారు.. లక్షాధికారులమని.. సంతోషించారు.. కాని అదే అత్యాశ..
ఇద్దరు పోలీసుల ఓని వేటు వేసింది.. వివరాలు ఇలా ఉన్నాయి.
చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడికొండ సెబ్ చెక్‌పోస్టు వద్ద తనిఖీ సిబ్బంది ఓ వ్యాపారిని బెదిరించి రెండు బంగారు బిస్కెట్లు లాక్కున్నారు. బాధిత వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. పెనుకొండ డీఎస్పీ మహబూబ్‌బాషా సోమవారం హిందూపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సోమశేఖర్ అనే వ్యాపారి ఆభరణాలు చేయించేందుకు బంగారం బిస్కెట్లు తీసుకొని బెంగళూరు వెళ్లారు. దసరా పండగ ఉండటంతో బెంగళూరులో దుకాణాలు తెరవలేదు. దీంతో ఆయన శనివారం కర్ణాటక ఆర్టీసీ బస్సులో సొంతూరుకు బయల్దేరారు. కొడికొండ చెక్‌పోస్టు వద్దకు రాగానే జాతీయ రహదారిపై సెబ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ నాగరాజు, ఎస్పీఓ వాలంటీర్ భాస్కర్, మరో ఇద్దరు విధుల్లో భాగంగా బస్సును తనిఖీ చేశారు. వ్యాపారి వద్ద మద్యం, బంగారం బిక్కెట్లు లభించడంతో బిల్లులు చూపాలని బెదిరించారు. అతని వద్ద ఉన్న రెండు బంగారు బిస్కెట్లు (ఒక్కొక్కటి 100 గ్రాములు) లాక్కున్నారు. బాధిత వ్యాపారి ఆదివారం చిలమత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రంగడు విచారణ చేపట్టి ఎక్సైజ్ కానిస్టేబుల్ నాగరాజు, ఎస్పీఓ భాస్కర్లను సోమవారం అదుపులోకి తీసుకుని రూ.9 లక్షల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.