• Neti Charithra

Breaking.. తంబల్లపల్లె లో పేలిన నాటు బాంబులు.. ఉలిక్కి పడ్డ స్థానికులు.. ఆస్పత్రి తరలింపు..!


Breaking.. తంబల్లపల్లె లో పేలిన నాటు బాంబులు.. ఉలిక్కి పడ్డ స్థానికులు.. ఆస్పత్రి తరలింపు..!


తంబల్లపల్లె: నేటి చరిత్రచిత్తూరు జిల్లా తంబల్లపల్లె లో నాటు బాంబులు పేలి ఒకరికి తీవ్రగాయాలు కావటం తో స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తంబల్లపల్లె మండలం ఎద్దుల వారిపల్లె పంచాయతీ గౌడసానిపల్లె లో ని రైతు


(నాటు బాంబు పేలి గాయపడ్డ రమణ రెడ్డి)


రమణారెడ్డి పాడి ఆవుల పాకలో చెత్త తొలగిస్తుండగా నాటు బాంబు పేలడంతో రైతుకు చేతులు ఛిద్రం అయ్యి

తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ రమణ రెడ్డి ని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తంబల్లపల్లె పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఇక్కడ పేలిన నాటు బాంబునిల్వలు ఇంకా ఏమైనా ఉన్నాయా... వీటిని ఎవరు ఉంచారు..ఇవి ఎందుకు నిల్వ ఉంచారు .. అన్న సమాచారాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.డిఎస్పీ రవి మనోహర చారి ఆదేశాలు మేరకు

చిత్తూరు నుంచి క్లూస్ టీం వచ్చి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

స్థానిక ఎస్ ఐ సహదేవి మీడియాతో మాట్లాడుతూ నాటు బాంబు పేలి ఒకరు గాయపడ్డారని ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నాం అన్నారు.